News

పాలడుగు కన్నుమూత


కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున(సోమవారం) తుదిశ్వాస విడిచారు. మధుమేహంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ముసనూరు మండలం గోగుల పాడుకు చెందిన పాలడుగు అంచెలంచెలుగా కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎదిగారు. 1968లో యువజన కాంగ్రెస్ లో చేరిన ఈయన, నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నేదురుమల్లి జనార్ధన్ కేబినెట్ లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సిగా ఉన్నారు. విభజన తర్వాత ఏపి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు.